మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక గిరిజనులను నిలువునా ముంచిన వైనం వెలుగులోకి వచ్చింది. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని నమ్మించి, గిరిజన గూడాల్లో కోట్లాది రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులు ఇప్పుడు పరారీలో ఉన్నారు.
రెక్కాడితే గానీ డొక్కాడని గిరిజనుల కష్టార్జితాన్ని దోచుకున్న ఈ ముఠాల వెనుక ఎవరి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయి? బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి, దోచుకున్న సొమ్మును రికవరీ చేసి గిరిజనులకు అందజేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.









