చందర్లపాడు లో ఘనంగా స్కూల్ రెడీనెస్ మేళ
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు (మండలం ), చందర్లపాడు(గ్రామం), చందర్లపాడు సెక్టార్ పరిధిలోని స్థానిక అంగన్వాడి కేంద్రంలో గురువారం స్కూల్ రెడీనెస్ మేళ అత్యంత ఉత్సాహకరంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడి సూపర్వైజర్ శ్రీలత మాట్లాడుతూ అంగన్వాడి యొక్క విశిష్టతను తెలుపుతూ మూడు సంవత్సరముల నుండి ఐదు సంవత్సరాలు నిండిన అంగన్వాడి పిల్లలను ప్రైమరీ పాఠశాల.
విద్య కొరకు సిద్ధం చేయడమే లక్ష్యంగా భావిస్తున్నామని తెలియజేస్తూ ఫ్రీ స్కూల్ పిల్లలకు సర్టిఫికెట్స్ అందించి వారిని ప్రైమరీ స్కూల్ లో జాయిన్ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో గౌరవనీయులు ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు రామారావు, పద్మ నందిగామ ప్రాజెక్ట్ ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీలత అంగన్వాడి వర్కర్స్ దుర్గాంబ, పి నిర్మల, పద్మ తల్లులు తండ్రులు పిల్లలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.










