“సంస్కృతిని కాపాడుకుందాం: కురుమ సంఘం కృషిని కొనియాడిన ఈటల.|

0
7

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : చెంగిచెర్లలోని బీరప్ప – కామరతి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది.

ఈ వేడుకల్లో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ఆలయాన్ని నిర్మించిన కురుమ సంఘం ప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందించారు.

కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరాల్లో ప్రజలకు సేదతీరడానికి పార్కులు, ఆధ్యాత్మిక ప్రశాంతతకు దేవాలయాలు ఎంతో అవసరమని, వీటి కోసం ప్రభుత్వాలు స్థలాలు కేటాయించాలని ఆయన కోరారు.

తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని, ప్రతి సమస్యపై పోరాడుతానని ఈటల హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఆలయ చైర్మన్ గొరిగి నరసింహ, జనరల్ సెక్రెటరీ తుర్పాతా ఆనంద్, కురుమ సంఘం నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#Sidhumaroju