అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఇంటి పట్టాల పేరుతో రూ.1 లక్ష తీసుకుని మోసం చేశాడని మేజారి మురళీధర్‌పై సి. సత్య గురువారం ఆరోపించారు. కోళ్ల బైళ్ళు గ్రామంలో ప్లాట్ ఇస్తానని చెప్పి.
తరువాత అదే స్థలాన్ని మరొకరికి విక్రయించాడని తెలిపారు. ఈ విషయంపై ప్రశ్నించగా బెదిరింపులకు గురిచేశాడని, అధికారులు స్పందించడం లేదని వాపోయారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.










