భారత్ అవాజ్ న్యూస్ :తెలంగాణ ఎండలు. దంచికొడుతున్నాయి.ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలనుంచే సూర్యుడి ప్రతాపం కొనసాగుతుండటంతో జనం బయటకురావాలంటే భయపడుతున్నారు.
ఆదివారం (మే 3) అన్ని జిల్లాలో 40 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వరంగల్, భూపాలపల్లిలో46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. దీంతో ఫస్ట్ టైం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు….









