శీర్షిక: కారంపూడి భారీ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి!
పల్నాడు జిల్లా కారంపూడిలో కలకలం సృష్టించిన బంగారం వ్యాపారిపై దోపిడీ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 566.60 గ్రాముల బంగారం, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
వినుకొండకు చెందిన వ్యాపారి శ్రీనివాసరావుపై దాడి చేసి నగలు దోచుకున్న ఈ ముఠాకు, అదే జ్యువెలరీ షాపులో పనిచేసే గోసుల శంబయ్య సూత్రధారి అని పోలీసులు తేల్చారు.
చెడు వ్యసనాలకు బానిసైన శంబయ్య తన స్నేహితులతో కలిసి ఈ పక్కా స్కెచ్ వేశాడు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకున్న దర్యాప్తు బృందాన్ని పల్నాడు ఎస్పీ అభినందించారు.









