కాళేశ్వరం : ‘రూ.34 కోట్లతో అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది..
భారత్ అవాజ్ న్యూస్ :భూపాలపల్లి జిల్లా. మే 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రూ.34 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. భక్తుల కోసం క్యూలైన్లు, తాగునీరు, చలివేంద్రాలు, అన్నదానం, రోజువారీ హారతి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.. తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగింది…









