డిగ్రీ అడ్మిషన్ల కొరకై దోస్త్ (DOST ) గడువు రేపే లాస్ట్

0
6

డిగ్రీ అడ్మిషన్ల కొరకై దోస్త్ (DOST ) గడువు రేపే లాస్ట్

 

*మద్దూరు* మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు ఫేజ్ -1 రిజిస్ట్రేషన్ గడువు రేపటితో (మే 7) ముగియనున్నదని కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ఉమ్మడి మండలంలోని విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. కళాశాలలో బి ఎ హెచ్ ఇ పి, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ ఎంపీసీ, ఎంపీసీఎస్, బి జెడ్ సి కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. అడ్మిషన్ల కొరకై విద్యార్థులు మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లు లేదా కళాశాలలో సంప్రదించాలన్నారు.