ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడి.

0
2

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ అడుగు పడింది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్, తిరుపతి జిల్లా సత్యవేడులో రూ. 2,200 కోట్ల పెట్టుబడితో తన నూతన తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

తమిళనాడు వెలుపల సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి భారీ ప్లాంట్ ఇదే కావడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని SIPB ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.

వన్నెలూరు, రాళ్ళకుప్పం పరిధిలోని 267 ఎకరాల్లో నిర్మించే ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి లభించనుంది. ప్రత్యేక వెండర్ పార్క్ ఏర్పాటుతో రాష్ట్రం ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ హబ్‌గా మారనుంది. 2029 నాటికి మొదటి దశ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.