టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం.

0
3

మదనపల్లె మండలం పుంగనూరు రోడ్డులోని 150 మైలు రాయి సమీపంలో బుధవారం రాత్రి నయారా పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

బైక్‌పై వెళ్తున్న పుంగనూరు మండలం కదిరినాధునికుంట గ్రామానికి చెందిన రైతు రవీంద్రనాథ్ రెడ్డిని టెంపో ట్రావెలర్ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.