అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం-రాహత్’ పథకం ద్వారా గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది.
ప్రమాదం జరిగిన తొలి 60 నిమిషాలు (గోల్డెన్ అవర్) కీలకమని, ఈ సమయంలో వెంటనే 112కు కాల్ చేసి బాధితులను ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలను కాపాడవచ్చని ఆయన అన్నారు. ఈ పథకం కింద 7 రోజుల పాటు నగదు రహిత చికిత్స లభిస్తుంది. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు సహా అందరూ అర్హులు. బాధితులను ఆసుపత్రికి చేర్చిన గుడ్ సమారిటన్‌లకు రూ. 25 వేల వరకు బహుమతి, పూర్తి రక్షణ ఉంటుందని ఎస్పీ వెల్లడించారు.










