నస్పూర్ : తేదీ 07/05/2026, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రసీదు ఇవ్వాలని, అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మరియు మొన్న లక్షెట్టిపేట్ మండలంలో చనిపోయిన నలుగురు రైతులకు ఒక్కక్కరికి 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన రహదారి పై
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వ లక్ష్మి నారాయణ, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మరియు బీజేపీ నాయకులు చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరుగు పేరుతో రైతులు పండించిన ధాన్యాన్ని బస్తాకు నాలుగు కిలోల చొప్పున దోచుకుంటుంది అని, కాంట పెట్టిన ధాన్యాన్ని లారీల కొరతతో తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. స్థానిక ఎమ్మెల్యేలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై అయ్యి కమీషన్ల కోసం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.










