నందిగామ మండలం పల్లగిరి గ్రామ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్ కార్యక్రమం నిర్వహించారు, గ్రామంలో ప్రజలకు రెవిన్యూ సమస్యలు పరిష్కారం చేసేందుకు ఒక నెలలో ఒక గ్రామంలో 4 సార్లు ప్రజా సమస్యలు పరిష్కారానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని ఆర్డీవో జీ అనిల్ కుమార్ తెలిపారు.
గ్రామాల్లో ప్రజలు రైతులు వారి వారి సమస్యలు గ్రామాల్లో ప్రతి గురువారం జరిగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని సద్వినిగం చేసుకోవాలని వారి వారి భూ సమస్యలు పరిష్కారం ప్రజల వద్ద సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఆర్డిఓ తెలిపారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నూతక్కి సురేష్ బాబు, ఎంపీడీవో ఆర్ ప్రసాదరావు, రెవిన్యూ అధికారులు గ్రామ నాయకులు రైతులు ప్రజలు పాల్గొన్నారు.










