రైతులు సోలార్ విద్యుత్ ను ఉపయోగించుకోవాలి

0
5

చిలుకూరు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే విద్యుత్ ను రైతులు ఉపయోగించుకోవాలని కోదాడ ఏడిఈ ప్రశాంతి కుమారి అన్నారు. ప్రజా పాలన ప్రగతి వారోత్సవాల్లో భాగంగా చిలుకూరు రైతు వేదికలో నిర్వహించారు. సోలార్ విద్యుత్ ను వ్యవసాయానికి గృహ అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు.

ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యుత్ పొదుపు కోసం రైతులు ఐ ఎస్ ఐ స్టాండర్డ్ మోటార్లను వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లు పుల్లమ్మ, ఏ డి ఈ ప్రశాంతి కుమారి, ఏఈ, శ్రీనివాస్, ఓరుగంటి శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.