ఆసిఫాబాద్ జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టెందుకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్.కే హరిత అధికారులకు కఠిన ఆదేశాలు జరిచేసారు.కలెక్టెరేట్లో అమె మాట్లాడుతూ,అనుమతి లేకుండా ఇసుక తరలించే వారిపై కచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.వినియోగదారులకోసం అందుబాటులో .
ఉన్నా” మన ఇసుక వాహనం”ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలనీ, ఎక్కడ అక్రమాలకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా రాత్రి సమయాల్లో జరిగే అక్రమ రవాణాపై నిఘా ఉంచేందుకు డ్రోన్లను ఉపయోగించాలని మరియు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.నిబంధనలు ఉల్లంగించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్బంగా అధికారులకు దిశనిర్దేశం చేసారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్










