గంగమ్మ ఒడికి గణనాథులు.. భక్తి పారవశ్యంలో నిమజ్జనాలు.|

0
3

 

● నిమజ్జనాలతో కిక్కిరిసిన అల్వాల్‌ చెరువు

● మల్కాజిగిరి కమిషనరేట్‌లో 11,629 విగ్రహాలు

● సెప్టెంబర్‌ 19 ఉదయం 6 గంటల వరకు లెక్కలు

● ప్రధాన నిమజ్జనాలతో మరింత పెరగనున్న సంఖ్య

అల్వాల్‌, సెప్టెంబర్‌ 20: వినాయక నిమజ్జనాలతో అల్వాల్‌ చెరువు సందడిగా మారింది. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సెప్టెంబర్‌ 14 నుంచి సెప్టెంబర్‌ 19 ఉదయం 6 గంటల వరకు మొత్తం 11,629 గణేష్‌ విగ్రహాలు నిమజ్జనం కాగా.. ఒక్క అల్వాల్‌ చెరువులోనే 1,810 విగ్రహాలు జలాధివాసం అయ్యాయి.

మల్కాజిగిరి పరిధిలో నమోదైన నిమజ్జనాల్లో 8,389 విగ్రహాలు మూడు అడుగులలోపు ఉండగా.. 3,240 విగ్రహాలు మూడు అడుగులు, అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్నవిగా లెక్క నమోదైంది. మల్కాజిగిరి జోన్‌లో 6,301, ఎల్‌బీనగర్‌ జోన్‌లో 3,412, ఉప్పల్‌ జోన్‌లో 1,916 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.

అల్వాల్‌తో పాటు హస్మత్‌పేట్‌ చెరువులో 3,274 విగ్రహాలు నిమజ్జనం కాగా.. సరూర్‌నగర్‌ చెరువులో 2,193, కృత్రిమ నిమజ్జన కొలనులో 609 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.

మరోవైపు ప్రధాన గణేష్‌ నిమజ్జన ఊరేగింపులు పూర్తికాకపోవడంతో రానున్న రోజుల్లో నిమజ్జనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

#Sidhumaroju

Alwal