నల్లబెల్లిలో హమాలీల సమ్మె.. రైతుల రాస్తారోకోతో ఉద్రిక్తత…
భారత్ అవాజ్ న్యూస్ : వరంగల్ జిల్లా నల్లబెల్లి గోదాముల వద్ద హమాలీల సమ్మె కారణంగా మొక్కజొన్న దిగుమతులు నిలిచిపోవడంతో రైతులు రోడ్డెక్కారు. హమాలీ ఛార్జీలు పెంచాలని, రోజువారీ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పనులు నిలిపివేశారు. దీంతో గంటల తరబడి వేచి ఉన్న రైతులు సహనం కోల్పోయి రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తహశీల్దార్ కృష్ణ, ఎస్సై సాయి ప్రసన్నకుమార్ అక్కడికి చేరుకుని హమాలీలు, రైతులతో చర్చలు జరిపారు. హమాలిలు సానుకూలంగా స్పందించారు…. భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి జి రాము…










