స్వేరోస్ సంస్థ క్రియాశీలక కార్యకర్త, ఆటో డ్రైవర్ కందుకూరి గురవయ్య స్వేరో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు పరామర్శించి, గురవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గురవయ్య లాంటి నిస్వార్థ కార్యకర్తలు స్వేరోస్ ఉద్యమానికి పునాదిరాళ్లు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూనే, సొంత ఖర్చులతో రాష్ట్రమంతా తిరిగి స్వేరో భావజాలాన్ని ప్రచారం చేశారు. భార్య మరణించినా ఇద్దరు పిల్లలను ఒంటరి తండ్రిగా పెంచిన ఆయన త్యాగం మరువలేనిది. అని కొనియాడారు. అలాగే పిల్లల చదువు బాధ్యత కూడా స్వేరోస్ సంస్థ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
గురవయ్య ఆశయ సాధన కోసం మనమంతా పనిచేయడమే ఆయనకు నిజమైన నివాళి. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం” అని ప్రవీణ్ కుమార్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య స్వేరో , సీనియర్ నాయకులు చడపంగు రవి, జిల్లా అధ్యక్షుడు బొల్లికొండ వీరాస్వామి, నాయకులు కందుకూరి ఉపేందర్ , ముదిగొండ చిరంజీవి, కందుకూరి శ్రీను, ముదిగొండ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.








