శీర్షిక: బస్సును వెంబడించి ఆపిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్: డ్రైవర్‌పై ఆగ్రహం
కథనం: కృష్ణా జిల్లా కంకిపాడులో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆర్టీసీ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాప్‌లో ప్రయాణికులు వేచి ఉన్నా బస్సు ఆపకుండా వెళ్లడాన్ని గమనించిన ఎమ్మెల్యే, తన కారుతో వెంబడించి బస్సును అడ్డగించారు. బస్సులోకి ఎక్కి డ్రైవర్, కండక్టర్‌ను నిలదీశారు. ప్రభుత్వం మహిళలకు ‘ఉచిత బస్సు’ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తుంటే, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. అనంతరం అదే బస్సులో ప్రయాణించి ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.










