నందిగామ పట్టణం కమ్మ కళ్యాణ మండపం నందు శుక్రవారం నాడు కాంట్రాక్టర్ పాలేటి సతీష్ సౌజన్యంతో నందిగామ మున్సిపల్ కార్యాలయానికి ట్రాక్టర్ మరియు రక్షిత మంచినీటి ట్యాంకర్‌ను ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సౌమ్య పాల్గొని మున్సిపాలిటీ అధికారులకు వాహనాలను అధికారికంగా అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు.
తాగునీటి సరఫరా అందించడంలో ఈ ట్రాక్టర్ మరియు మంచినీటి ట్యాంకర్ ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. సమాజ సేవా దృక్పథంతో మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించిన కాంట్రాక్టర్ పాలేటి సతీష్ గారిని ప్రత్యేకంగా అభినందించారు. నందిగామ పట్టణ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, దాతలు కలిసి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, వివిధ రాష్ట్ర కార్పోరేషన్ డైరెక్టర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నా.రు.









