ఆదోని పట్టణంలో కార్పొరేట్ భాష్యం పాఠశాలకు, ప్రభుత్వ నిబంధనలు వర్తించవని కొనియాడారు. అనంతరం (DSF),(PDSO) ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ.ఆదోని పట్టణంలో ఉన్నటువంటి కార్పొరేట్ భాష్యం పాఠశాలలో రెండు రోజుల క్రితం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సెలవు దినాల్లో టీచర్లతో పని చేపిస్తున్నారు….. సెలవు దినాల్లో టీచర్లతో ఎలా పని చేపిస్తారు అని అడిగితే మా పాఠశాల మా ఇష్టం అని మేము రన్ చేసుకుంటాం మీరు ఎవరు అడగడానికి అని విద్యార్థి సంఘాలను దురుసుగా మాట్లాడడం చాలా దారుణమైన పరిస్థితి .
ఇంత జరుగుతున్నా కూడా విద్యాశాఖ అధికారులు కేవలం సీటుకు మాత్రమే పరిమితమైనారని డి.ఎస్.ఎఫ్ పి.డి.ఎస్.ఓ విద్యార్థి సంఘాలుగా సూటిగా విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నాము.ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం సమ్మర్ హాలిడేస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికైనా కార్పొరేట్ భాష్యం పాఠశాలపై సమగ్ర విచారణ జరిపి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ ఒక్కొక్క టీచర్ కు ఇన్ని అడ్మిషన్లు అని, చెప్పి ఒత్తిడి తీసుకురావడం చాలా దుర్మార్గమైన పరిస్థితి అలాగే సెలవు దినాల్లో టీచర్లతో పని చేపించడం ఎంతవరకు కరెక్ట్ ఇలా అనేక రకాలుగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ భాష్యం పాఠశాల వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తక్షణమే ఆదోని పట్టణంలో ఉన్నటువంటి భాష్యం పాఠశాల పై, ప్రిన్సిపాల్ సురేంద్ర పై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులకు మరొక్కసారి హెచ్చరిస్తున్నాము.. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు హరి విక్రమ్ పిడిఎస్ఓ నాయకులు రఘు అమర్నాథ్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.










