మహబూబాబాద్,మే 8: ములుగు నియోజకవర్గ పరిధిలో ప్రతి మండలానికి నూతన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను ఎన్నుకోవడం యువతకు గొప్ప అవకాశంగా నిలిచింది. ఇందులో భాగంగా కొత్తగూడ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా యువ నాయకుడు చొప్పరి కుమార్ నియమితులవడం ఆనందకర విషయం. తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సన్మానించడం ఆయనపై పార్టీ నాయకత్వానికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. చిన్న వయస్సు నుంచే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని,
పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసిన చొప్పరి కుమార్కు ఈ బాధ్యత రావడం యువతకు స్ఫూర్తిదాయకం. ప్రజల మధ్య ఉంటూ, పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ సేవా భావంతో ముందుకు సాగుతున్న ఆయనకు ఈ పదవి రావడం ఆయన కృషికి వచ్చిన గౌరవంగా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కుంజ సూర్య, ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు ఇస్సార్ ఖాన్, ములుగు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సుమన్ రెడ్డి పాల్గొని చొప్పరి కుమార్కు శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులందరూ కలిసి యువత కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలవాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆకాంక్షించారు.










