మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్‌పై అదే విభాగానికి చెందిన మరో ఉద్యోగి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు నందిని తెలిపిన వివరాల ప్రకారం.
స్కానింగ్ రూములో ప్రజలు చూస్తుండగానే సాయి అనే సహోద్యోగి తనపై దాడి చేశాడని ఆరోపించింది. ఈ ఘటన బుధవారం జరగగా, గురువారం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి వర్గాలు, పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.










