అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న 4 సైట్ ఇంజనీర్, 3 డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీసీ డా. నున్నా అనూరాధ తెలిపారు.
సైట్ ఇంజనీర్ పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ లేదా డిప్లొమా, డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఈ నెల 14లోగా సమగ్ర శిక్షా జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి.










