చింతూరులో ‘స్వచ్ఛ రథం’ ప్రారంభం ప్లాస్టిక్ ఇస్తే నిత్యావసరాలు పంపిణీ!

0
3

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చింతూరు మండలంలో ఒక వినూత్న కార్యక్రమం మొదలైంది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని చింతూరు మండలం టీడీపీ అధ్యక్షుడు జమాల్ ఖాన్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.ప్రజల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలకు బదులుగా వారికి నిత్యావసర వస్తువులను అందజేయనున్నారు.

గ్రామాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పర్యావరణాన్ని కాపాడటం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ దొర, సంబంధిత శాఖల కార్యదర్శులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం చేపట్టిన ఈ వినూత్న ఆలోచనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

# Yadagiri