సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెబుతుంటారు. కానీ ఆ మాటలను చేతల్లో చూపిస్తూ ప్రతి మహిళలో తన తల్లినే చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు కోదాడ టౌన్ సీఐ శివశంకర్. ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా ఆయన చూపిన ఆప్యాయత, మానవత్వం స్థానిక ప్రజలను భావోద్వేగానికి గురిచేసింది.









