సింధు హాస్పిటల్ — మూడు పార్టీల చేతులు కలిసిన కథ

0
9

హేటెరో గ్రూప్ చైర్మన్, BRS రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి — తన ప్రియమైన కుమార్తె కృష్ణ సింధురి జ్ఞాపకార్థం హైటెక్ సిటీలో అద్భుతమైన క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించారు.

‎ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా దాన్ని జాతికి అంకితం చేస్తున్నారు.

‎కానీ ఈ ఆస్పత్రి వెనుక ఉన్న రాజకీయ కథ చదవండి…

‎2018 — BRS హయాంKCR ప్రభుత్వం ఖానామెట్‌లో ₹500 కోట్ల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని — కేవలం ₹1.47 లక్షల వార్షిక అద్దెకు సాయి సింధు ఫౌండేషన్‌కు అప్పగించింది. అదే సమయంలో హేటెరో గ్రూప్ BRS కి ₹120 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు — ఆ తర్వాత పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సీటు.

‎2023 — హైకోర్టు జోక్యం ఈ లీజు చట్టవిరుద్ధమని హైకోర్టు GO రద్దు చేసింది. మళ్ళీ పరిశీలించమని ఆదేశించింది.

‎అదే 2023 — రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ “ఈ భూమి కేటాయింపు పూర్తిగా చట్టవిరుద్ధం. అధికారంలోకి వస్తే సంబంధితులందరినీ జైల్లో వేస్తాం!”

‎మార్చి 2024 — అదే రేవంత్ రెడ్డి CM అయ్యాక అప్పటికే సగానికిపైగా నిర్మాణం పూర్తయింది. GO 37 జారీ చేసి లీజు ఖరారు చేశారు. జైలు మాటేది? మాయమైంది.

‎మే 10, 2026 — ఈ రోజు BRS ఎంపీ నిర్మించిన ఆస్పత్రిని BJP ప్రధాని ప్రారంభిస్తున్నారు. Congress CM వేదికపై ఉంటారు.

‎BRS భూమి ఇచ్చింది ✅ Congress లీజు ఖరారు చేసింది ✅ BJP ప్రారంభించింది ✅

‎మూడు పార్టీలు — ఒకే లబ్ధిదారుడు. తెలంగాణ రాజకీయాల్లో ఇది కొత్తేమీ కాదు!