మదనపల్లె మండలంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పసినికొండ జన్మభూమి కాలనీకి చెందిన చంద్ర నాయక్ (61) అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. సొంత పనిమీద బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా.
రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన స్కూటర్ ఆయనను ఢీకొట్టింది. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే చంద్ర నాయక్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









