పుంగనూరులో ఆకట్టుకున్న గంధం వేడుకలు

0
0

పుంగునూరులోని పుంగమ్మ చెరువు కట్టపై ఉన్న హజరత్ నూరుషావలి బాబా ఉరుసు ఉత్సవాన్ని శుక్రవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పహిల్వాన్ సాబు సాహెబ్ ఇంటి నుంచి గంధం కార్యక్రమం ప్రారంభమైంది.

దర్గాలో నమాజ్ చేశారు. పట్టణ పురవీధుల్లో డ్రమ్స్ వాయిస్తూ, బాణసంచా పేలుస్తూ యువత నృత్య ప్రదర్శనల మధ్య గంధం ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు# కొత్తూరు మురళి.