Madanapalle: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన శ్రేణులు సన్నద్ధం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాకినాడలో జరిగిన ఈ సమావేశానికి మదనపల్లె నుంచి దారం అనిత హాజరయ్యారు.

0
1

Madanapalle: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళవారం కాకినాడలో జనసేన నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల సన్నాహకాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మదనపల్లెకు చెందిన రాజంపేట రీజినల్ కో-ఆర్డినేటర్ దారం అనిత ప్రత్యేకంగా హాజరయ్యారు. రాజంపేట పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సభ్యురాలిగా కూడా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నియమించిన కమిటీలు క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధివిధానాలు, ఎన్నికల కార్యాచరణపై పవన్ కళ్యాణ్ వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు