భూమి ఆక్రమణపై బాధితురాలు లక్ష్మమ్మ ఆవేదన

0
0

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానపల్లి పంచాయతీ లక్కుంట గ్రామ సమీపంలో తమ సొంత భూమిని ఆక్రమించి టమోటా సాగు చేస్తున్నారని బాధితురాలు లక్ష్మమ్మ ఆరోపించారు.

సర్వే నంబర్ 337/3లోని 2 ఎకరాల 48 సెంట్ల భూమి తన భర్త ఎస్. చెన్నారాయప్ప పేరిట నమోదైందని, అనారోగ్య కారణాలతో బయట ఉన్న సమయంలో కొందరు భూమిని కబ్జా చేశారని ఆమె తెలిపారు. అధికారులు స్పందించి తమ భూమిని తిరిగి ఇప్పించాలని లక్ష్మమ్మ కోరారు# కొత్తూరు మురళి.