మదనపల్లె బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. 16 మంది భక్తులకు గాయాలు.

0
1

మదనపల్లె బైపాస్‌ రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది బోయకొండ భక్తులు గాయపడ్డారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లుకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న ఐచర్‌ వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న రెండో పట్టణ సీఐ మహమ్మద్ రఫీ ఘటనా స్థలాన్ని పరిశీలించి, జిల్లా ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆయన తెలిపారు.