వరంగల్: భారీ వర్షం.. అన్నదాత ఆందోళన
భారత్ అవాజ్ న్యూస్ :9 మే వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా కురిసిన వానకు కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న బస్తాలు తడిసి ముద్దయ్యాయి. రైతులు హుటాహుటిన పరదాలు కప్పినప్పటికీ, గాలులకు అవి కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షంతో తమ కష్టం నీళ్లపాలవుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మీ ప్రాంతంలో వర్షం కురుస్తోందా దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము









