చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లి మండలం సింగిరిగుంటలో వెలసిన శ్రీ విజయ వినాయకస్వామి ఆలయంలో శనివారం శ్రీ సిద్ధి, బుద్ధి సమేత విజయ వినాయకస్వామి ఉత్సవమూర్తులతో పాటు మూలవిరాట్ స్వామివారికి మహారుద్రాభిషేకం, కళ్యాణోత్సవం వైభవంగా శనివారం నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.
ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్తలు, విజయవాణి విద్యాసంస్థల ప్రతినిధులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు# కొత్తూరు మురళి.









