మదనపల్లెలోని 7వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా న్యాయవాది జె. గణపతిని నియమించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ ఉత్తర్వుల మేరకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఏపీ రామకోటేశ్వరరావు ఈ నియామక ఉత్తర్వులను శనివారం జారీ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గణపతిని సన్మానించి, ప్రజలకు సత్వర న్యాయం అందించాలని ఆకాంక్షించారు. క్లిష్టమైన కేసుల పరిష్కారంలో ఆయన సమర్థంగా వ్యవహరిస్తారని అభిప్రాయపడ్డారు.










