ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: CM రేవంత్ రెడ్డి
భారత్ అవాజ్ న్యూస్:10 మే ఈరోజున
TG: ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని CM రేవంత్ అధికారులను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత రాకుండా చూసుకోవాలన్నారు. ఒప్పందం మేరకు లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసుల నమోదు చేయాలని తేల్చిచెప్పారు. ప్రతి అధికారి జవాబుదారీతనంతో ఉండాలని స్పష్టం చేశారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము….










