నల్లబెల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు
భరత్ అవాజ్ న్యూస్: 10 మే ఈరోజు ఉదయం వరంగల్ జిల్లా…నల్లబెల్లి మండలం మేడపల్లి క్రాస్ వద్ద హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పకు రక్షణగా రైతు పెట్టిన రాళ్లను గమనించని వాహనదారుడు బలంగా ఢీకొట్టాడు. దీంతో వాహనం అదుపుతప్పి కింద పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.. అధికారులు త్వరగా స్పందించగలరని కోరుకుంటున్నాం….. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము










