మదనపల్లె మార్కెట్‌కు 391 మెట్రిక్ టన్నుల టమాటాలు ఆదివారం వచ్చాయి. గత 3 రోజులుగా టమాటా ధరలు పతనం వైపు అడుగులు వేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొదటి రకం టమాటాలు 10 కిలోలకు రూ.230, రెండో రకం రూ.180, మూడో రకం రూ.160 చొప్పున అమ్ముడుపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. గతంలో కిలో రూ.38 వరకు ధర పలికిన టమాటాలు ఇప్పుడు గణనీయంగా పడిపోయాయి.










