వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు: మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు
నందిగామ సెప్టెంబర్ 25భారత్ ఆవాజ్ : ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు ఆరోపించారు. నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా జగన్మోహన్రావు మాట్లాడుతూ తమపై రౌడీషీట్ ఓపెన్ చేశారని, ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించినందుకే తమపై ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. “మేము రౌడీషీటర్లమైతే మరి మీరు..? గతంలో మీపై కూడా కేసులు నమోదయ్యాయి కదా.. మీ పై ఉన్నది కూడా రౌడీషీటేనా?” అని ప్రశ్నించారు.
డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నించాం
డీఎస్సీ విషయంలో అక్రమాలు జరిగాయని భావించినందువల్లే తాము ప్రశ్నించామని జగన్మోహన్రావు తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా ప్రశ్నించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.
కంచికచర్ల నేతలపై కేసులా?
కంచికచర్లకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు వేమా సురేష్, మార్తా శీను ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను కేసులతో భయపెట్టే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కును హరించకుండా ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్రావు కోరారు.










