చందర్లపాడులో అంగన్‌వాడీ ఉత్సవం
చందర్లపాడు సెప్టెంబర్ 25 Bharat Aawaz : పోషణ మాసంలో భాగంగా చందర్లపాడు మండలం చందర్లపాడు గ్రామంలోని 1, 2, 3, 4, 5 అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ ఉత్సవం నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు నందిగామ సీడీపీవో లక్ష్మీ భార్గవి ఆదేశాల మేరకు సూపర్‌వైజర్ శ్రీలత ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతల సంరక్షణ, శిశు ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, టీకాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఆటపాటల ద్వారా చిన్నారులకు విద్యాబోధన నిర్వహించారు. చిన్నారుల ఎత్తు, బరువులను పరిశీలించి, తల్లి–శిశు ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, తల్లిదండ్రులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.










