అన్నమయ్య జిల్లా ఈగిల్ సెల్ ఆధ్వర్యంలో మదనపల్లిలోని రైజ్డ్ ఆన్ డెనిమ్ ఇండియా యూనిట్-2లో సోమవారం “డ్రగ్స్ వద్దు బ్రో” పేరుతో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఫ్యాక్టరీ కార్మికులకు డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ సమాచారం తెలిసిన వారు ఈగిల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా వాట్సాప్ నంబర్ 8688830014కు సమాచారం అందించాలని కోరారు.










