జాతీయ స్థాయిలో అన్నమయ్య ఖ్యాతిని చాటిన చిన్నారి శైలేష్ గౌడ్.

0
4

మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో, నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన చిన్నారి బి. శైలేష్ గౌడ్‌ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం అభినందించారు.

పెద్దమండ్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న శైలేష్, జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతిభ కనబరచడం గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు బి. మధుకర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ ఉందని, శైలేష్ విజయం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అన్నారు.