10వ తరగతి పాసైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు పంపిణీ

0
4

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు  కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని,ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాయని సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్ అన్నారు.చందర్లపాడు మండలం కోనాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతిలో 31మంది విద్యార్థులకు గాను 30 మంది విద్యార్థులు పాస్ అయినారు.

#10thClassసొసైటీ బ్యాంక్ అధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో 30 మంది పదవ తరగతి పాసైన విద్యార్థులకు సీల్డ్ తో పాటు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున నగదు ప్రోత్సకాలను సోమవారం సొసైటీ బ్యాంకు లో అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కఠోర దీక్ష,నిరంతర సాధనను అలవర్చుకొని చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు.చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.విద్యార్థుల ఎదుగుదలలో కుటుంబం,కుటుంబాల ఎదుగుదలలో దేశం ఉండాలని కోరారు.ఏ కార్యక్రమంలో సొసైటీ బ్యాంక్ సిబ్బంది,స్కూల్ చైర్మన్ మార్కపూడి జాన్ కోటయ్య,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.