“చట్టం ముందు అందరూ సమానమే: మంచు మనోజ్”

0
6

మంచు మనోజ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై స్పందిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మైనర్ బాలికకు న్యాయం జరగాలని, అందుకోసమే పోక్సో చట్టం రూపొందించబడిందన్నారు.

అధికారం, హోదా, ప్రభావం ఏదైనా సరే చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. మైనర్లకు సంబంధించిన కేసుల్లో పారదర్శకంగా, వేగంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఆలస్యం, మౌనం ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. నిజం బయటకు రావడం, న్యాయం జరగడమే ముఖ్యమని, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాత విచారణ జరపాలని కోరారు.