నారా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నేడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సదస్సులో ప్రసంగించడంతో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో కూడా భేటీ కానున్నారు. అనంతరం గువాహటికి వెళ్లి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.










