కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు Bandi Bhagirath పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సీఎం Revanth Reddy సూచనల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు.
మహిళా ఐపీఎస్ అధికారిణి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగనుంది. బాధితురాలి స్టేట్‌మెంట్ ఇప్పటికే నమోదు కాగా, మరోసారి రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో భగీరథ్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తూ, నేరం రుజువైతే అరెస్ట్ చేస్తామని కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ తెలిపారు.









