అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం పట్రపల్లి తండాలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. బడిగిరెడ్డిపల్లి సమీపంలోని పెద్ద చెరువులో ఈతకు వెళ్లిన వరుణ్ (14), నీలేశ్ నాయక్ (8) అనే ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బురదలో చిక్కుకొని మృతి చెందారు.
స్థానికులు వారిని వెలికి తీసినా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.








