మదనపల్లెలో బైక్‌లకు అధిక శబ్దం వచ్చేలా సైలెన్సర్లు మార్చుతున్న వర్క్‌షాప్‌లపై అధికారులు బుధవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు 12 మెకానిక్ షాపులను పరిశీలించగా, మూడు చోట్ల నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు, ఇతర యాక్సెసరీస్ అమర్చుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆయా వర్క్‌షాప్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఇలాంటి మార్పులు చేస్తే మోటార్ వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.










