సింగరేణికి పూర్వ వైభవం తీసుకొస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

0
7

మంచిర్యాల జిల్లా, మే 14: సింగరేణి కార్మికులతో కాకా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి వివేక్ వెంకటస్వామి. సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం కార్మికులు, అధికారులు సమిష్టిగా బాధ్యతగా పనిచేయాలని సూచించారు.సింగరేణి సంస్థకు రూ.400 కోట్ల నిధులు

ఇప్పించి లక్ష ఉద్యోగాలను కాపాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని మంత్రి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కోల్ బ్లాక్ టెండర్లలో సింగరేణి సంస్థ పాల్గొనేలా చర్యలు తీసుకుంటోందన్నారు.