అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో బుధవారం బంగారు నగల దుకాణాల నిర్వాహకులతో సీఐ సుబ్బారాయుడు భద్రతా సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుండి కార్మికులుగా వచ్చిన వారి వివరాలను పోలీసులకు తెలియజేయాలని, అనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. ఈ సమావేశంలో బంగారు దుకాణాల నిర్వాహకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .










